ప్రకాశం: మార్కాపురం మండల పరిషత్ సమావేశపు హాల్లో శుక్రవారం డివిజనల్ లెవెల్ శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రజా ప్రతినిధులకు DLDO బాలు నాయక్ అవగాహన కల్పించారు. పంచాయతీ అధికారులు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.