CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు శ్రీ కోదండ రామస్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ప్రశాంత్ నగర్లోని శాస్తగిరి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మకర జ్యోతి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.