ELR: కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర పాలసీ ప్రకటించాలని కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం పెదవేగి మండలం విజయరాయిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఫార్ములా ప్రకటించి కోకో గింజలకు ధర నిర్ణయించాలన్నారు.