KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో గో సంరక్షణ కొరకు డోన్ వాస్తవ్యులైన లక్ష్మీనారాయణ గుప్తా అండ్ నిర్మల రూ. 50,000 మంగళవారం విరాళంగా అందజేశారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్ అందజేసి పూలమాలతో సత్కరించారు.