SKLM: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్ అన్నారు. మంగళవారం అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.