KDP: పులివెందుల పట్టణ సమీపంలోని వెంకటాపురంలో గురువారం జూదం ఆడుతున్న ప్రదేశంలో సీఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. దీంతో జూదరులు పారిపోయారు. నిర్వాహకుడికి సీఐ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఖాళీ కుర్చీలు, టెంట్లు మాత్రమే అక్కడ మిగిలిపోయాయి. గంజాయి, మట్కా జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.