ప్రకాశం: కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం రహదారి వద్ద శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళుతున్న లారీ తిమ్మన్నపాలెం వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవటంతో లారీ రోడ్డు పక్కనే ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. దుకాణంలో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ కు గాయాలు కావటంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.