సత్యసాయి: పరిగి మండలంలోని సీగిపల్లె గ్రామంలో నేడు మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పర్యటించనున్నట్లు మండల కన్వీనర్ నరసింహమూర్తి తెలిపారు. ‘కాఫీ విత్ వైసీపీ లీడర్స్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.