కోనసీమ: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ప్రజలకు అమిత్ షా సమాధానం చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.