SKLM: టెక్కలి మండలం సింగుమహంతి పేట గ్రామానికి చెందిన కె తులసి అనే ఆమె శనివారం మధ్యాహ్నం పలాస నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ను నౌపడ రైల్వే స్టేషన్లో ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో గాయాలయ్యాయి. టెక్కలి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందిస్తూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.