వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్ తగిలింది. ‘గడపగడపకు’లో ఇప్పటివరకూ అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్‌డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆనంకు సూచించారు. ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన ఆనంకు వైసీపీ వరుస వేధింపులకు దిగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్ నేత అయినప్పటికీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధాన్యత లేదని తొలి నుంచీ అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇంతకాలం మౌనంగా వ్యవహరించిన ఆయన ఇటీవల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమయ్యేలా మాట్లాడారు. దానికి కారణం రామ్‌కుమార్‌రెడ్డి కి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెరగడమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలే రామ్‌కుమార్‌రెడ్డి ఏకంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.