సత్యసాయి: అమరాపురం మండలం తంభాలట్టి వాసి అయిన టీమ్ ఇండియా కెప్టెన్ (భారత అంధుల జట్టు) దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఫోటో దిగారు. ఇటీవల వరల్డ్ కప్ గెలవడంపై ప్రధాని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు సైతం దీపికను అభినందించారు.