E.G: జిల్లాలో గృహ నిర్మాణ పనులకు సంబంధించి ఉపాధి పనిదినాలు లక్ష్యం 84 శాతం సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. డ్వామా, స్త్రీశిశు సంక్షేమ, రెవెన్యూ, పరిశ్రమల శాఖల ప్రగతిపై సోమవారం సాయంత్రం ఆమె సమీక్షించారు. ఉపాధి హామీ పనిదినాల లక్ష్యం నూరుశాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.