ప్రకాశం: బైక్లు వేగంగా నడపొద్దు అన్నందుకు వ్యక్తిపై దాడి చేసిన ఘటన కనిగిరిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి టకారిపాలెం ప్రాంతానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేశారని షేక్ కాసిం అనే వ్యక్తి ఆరోపించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.