ATP: రాయదుర్గంలో జాతి వైర్యాన్ని సైతం మరిచి ఓ వరాహం శునకం పిల్లలకు పాలు ఇచ్చి అమ్మతనాన్ని చాటుకుంది. కోటలో శంకరమఠం ఆలయం సమీపాన ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రజలు ఈ ఘటన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు అనుకుంటున్నారు.