E.G: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ ఆర్.శ్యామల రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెను మంగళవారం స్థానిక మంజీరా హోటల్లో మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆమెను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారు పార్టీ పరిస్థితులపై చర్చించారు.