VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 50% పూర్తికావస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్త్ పనులు 99.3%, రన్ వే పనులు 65%, టాక్సీ వే 41%, టెర్మినల్ బిల్డింగ్ 38.59%, ATC 43.94%, చొప్పున పనులు జరిగాయన్నారు.