BPT: చందోలు-పొన్నూరు రోడ్డు దుస్థితిపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్రస్థాయిలో స్పందించారు. వెంటనే ఈ రహదారి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఈ విషయంలో కృషి చేయాలని కోరారు. చందోలు ఆలయానికి వచ్చే ముందు ఈ రోడ్డు పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న తాను వేరే రహదారిలో ఆలయానికి వచ్చానని అన్నారు.