»A Shock To Ap Junior Colleges If You Dont Follow Those Rules There Will Be Heavy Penalties
AP Junior Colleges: ఏపీ జూనియర్ కాలేజీలకు షాక్.. ఆ రూల్స్ పాటించకుంటే భారీ జరిమానాలు
ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.
ఏపీలోని ప్రైవేటు జూనియర్ కళాశాల(AP Private Junior Colleges)లకు ఇంటర్ బోర్టు(Inter Board) షాకిచ్చింది. ఇంటర్ విద్యామండలిలో గట్టి హెచ్చరికలను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలు(Rules) ఉల్లంఘించే ఇంటర్ ప్రైవేటు కాలేజీలకు భారీ జరిమానాలు(Penalties) విధించనున్నట్లు ఇంటర్ బోర్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ ఉన్నటువంటి జరిమానాలను మరో 5 రెట్లు పెంచుతూ ఇంటర్ బోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్ కళాశాలలు(Inter Colleges) ఒక మండలం లేదా మున్సిపాలిటీ నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా మార్చినట్లైతే ఇది వరకూ రూ.50 వేలు జరిమానా(Penalties) విధించేవారు. ఇకపై ఆ జరిమానా కాస్తా రూ.2.50 లక్షలకు పెంచుతూ ఇంటర్ బోర్డు(Inter Board) ఉత్తర్వులిచ్చింది. మండలం నుంచి నగరానికి అనధికారికంగా మార్చినట్లైతే విధించే జరిమానాను రూ.లక్షనుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ఇంటర్ బోర్టు ఆదేశాలిచ్చింది.
ఇకపై అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు కళాశాలను మార్పు చేసినా రూ.5 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్టు(Inter Board) స్పష్టం చేసింది. మహిళా కళాశాలకు మాత్రమే అనుమతి తీసుకుని కో ఎడ్యుకేషన్ నిర్వహించినట్లైతే రూ.2 లక్షల వరకూ జరిమానాను విధిస్తామని ప్రైవేటు కళాశాలల(Private Colleges) యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటన చేసింది.