NDL: జూపాడుబంగ్లా మండలాధ్యక్షురాలిపై శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి మద్దతు పలకడంతో సువర్ణమ్మ తన పదవిని కోల్పోయారు. నూతన అధ్యక్షురాలిగా పారుమంచాల గ్రామానికి చెందిన మిద్దె నీలమ్మను సభ్యులు ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

