VZM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభల్లో 75 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కె.ఎస్.లక్ష్మణరావు, టి.సురేష్, కోశాధికారిగా జి.మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శుల సభ్యులుగా డా.ఆదిశేషు, వర్మ, స్వరూపరెడ్డితోపాటు మరికొందరు ఎన్నికయ్యారు.