GDWL: కేటి దొడ్డి మండలంలోని ముత్యాల తండాలో 19 ఏళ్ల యువతి ఈరమ్మ గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల కిందట మద్దెలబండ తండాకు చెందిన యువకుడితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న యువకుడి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని, ఈరమ్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.