ATP: గుంతకల్లులోని NAC సెంటర్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 90 రోజులపాటు ఉచిత అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, ల్యాండ్ సర్వేయర్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు సోమవారం తెలిపారు. టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయిన, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారిని అర్హులుగా ప్రకటించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు.