KRNL: సుంకేసుల బ్యారేజీ ద్వారా కర్నూలు జిల్లాలోని ప్రజలకు త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా నీటిని అందించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సుంకేసుల బ్యారేజీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. సుంకేసుల బ్యారేజీలో చిన్నపాటి లీకేజీలు ఉన్నాయని వాటిని అరికట్టాలన్నారు.