GNTR: ఫిరంగిపురంలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని CPM పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఈమని అప్పారావు, ఫిరంగిపురం మండల కార్యదర్శి ఎస్కె. మస్తాన్ వలి అన్నారు. శుక్రవారం ఫిరంగిపురం గ్రామంలోని అల్లం వారి పాలెంలో డ్రైనేజీ, మంచినీటిచెరువు, రోడ్ల పరిస్థితిని సీపీఎం నాయకులు పరిశీలించారు.