PLD: డిసెంబర్ 31న జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకూరపాడు మండలంలోని నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, బూత్, సెక్షన్ ఇన్చార్జ్లు, సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు.