SKLM : నారీ శక్తి కార్యక్రమంపై మహిళలకు అవగాహన అవసరమని పొందూరు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ చట్టాలపై సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలకు గురికావద్దని హెచ్చరించారు. శక్తి యాప్ను వినియోగించుకుని మోసాలకు గురికాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, బాలలు భద్రతపై తగిన సూచనలు ఇచ్చారు.