NLG: జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూరియాపై స్థానిక MLA లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు.