W.G: నరసాపురం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం సమావేశ మందిరంలో వినాయక చవితికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్డీవో దాసి రాజు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీవేద పాల్గొన్నారు.