NZB: జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం కమిషనరేట్లో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.