తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాలాయపల్లి PHCలో గురువారం ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. డాక్టర్ వెంకటరెడ్డి ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. బీపీ, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో నోటి క్యాన్సర్, మహిళలకు రొమ్ము క్యాన్సర్ మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టెస్టులు చేశారు.