ATP: కళ్యాణదుర్గంలో ఆగస్టు 16న ఆత్మహత్య చేసుకున్న గర్భిణి శ్రావణి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. వీడియో కాల్ ద్వారా మాట్లాడి సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి ధైర్యం ఇచ్చి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.