VSP: వెలంపేట పూలవీధిలో భవనం పక్కకు వాలడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో సమన్వయం చేసి బాధితులకు సురక్షిత స్థలంలో వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.