CTR: డీఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లు వాట్సాప్ గ్రూపులో వస్తున్న మెసేజ్‌లు ఫేక్ అని చిత్తూరు డీఈవో వరలక్ష్మి బుధవారం ఓ ప్రకటన ద్వారా స్పష్ట చేశారు. సెలెక్ట్ అయిన వారు నాగయ్య కళాక్షేత్రంలో జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని వస్తున్న మెసేజ్‌లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.