GNTR: కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలను సోమవారం లెక్కించారు. దేవాలయ హుండీ ఆదాయం రూ.12,65,728గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం పెరిగిందని వారు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ బాపట్ల ఇన్స్పెక్టర్ ఎం.గోపి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.