ASR: రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 78 వినతులు వచ్చినట్లు పీవో స్మరన్ రాజ్ తెలిపారు. ప్రధానంగా సీమగండి-వేములకొండ, కుట్రవాడ-పాములేరు గ్రామాల మధ్య రోడ్లు, నూతన పెన్షన్ల కోసం ప్రజలు విజ్ఞప్తి చేశారు. కొన్ని సమస్యలను పీవో తక్షణమే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.