SKLM: పంటను ఆశించే తెగుళ్లును గుర్తించడం రైతులకు కీలక దశ వంటిదని వ్యవసాయ అధికారి సింహాచలం అన్నారు. గురువారం ఎల్.ఎన్.పేట మండలంలోని బొడ్డవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులతో కలిసి పంట పొలానికి వెళ్లి పంటలను ఆశించే తెగుళ్లపట్ల అవగాహన కల్పించారు. ఆయనతో పాటు గ్రామ సచివాలయం, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.