TPT: సీఎం చంద్రబాబు ఆదివారం తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. 4 రోజుల పాటు జిల్లాలో ఉండనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి ఏర్పాటు చేసిన గ్యాస్ కనెక్షన్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అదే రోజు సాయంత్రం నారావారిపల్లెకు చేరుకుని సంక్రాంతి పండుగ సందర్భంగా 13, 14, 15 తేదీల్లో చంద్రబాబు అక్కడే ఉంటారు.