NLR: వెంకటాచలం మండలం కసుమూరులో డెంగీ కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కసుమూరు కొండ కింద ఎస్సీ కాలనీ, మంగళంపాడు తదితర గ్రామాల్లో లార్వా సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి జ్వరాలపై ఆరా తీశారు. ఇళ్ల ఆవరణలో నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.