ATP: వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. వినాయక చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. నిమజ్జనం రోజున కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు.