VSP: పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలను సీఐ సిహెచ్. శ్రీధర్ గుర్తించి వీటిని పద్మనాభం ఎమ్మార్వో కె. ఆనందరావు ముందు హాజరపరచారు. ఆయన ఒక్కొక్క లారీకి రూ. 5 వేలు చొప్పున రూ. 15 వేలు జరిమాన విధించారు.