ADB: జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత సామల రాజవర్ధన్ తెలంగాణ సారస్వత పరిషత్ గౌరవ సభ్యుడిగా నియమితులయ్యారు. తెలుగు సాహితీ వికాసానికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఇచ్చినట్లు పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యలు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కవులు, సాహితీ అభిమానులు రాజవర్ధన్కు అభినందనలు తెలిపారు.