W.G: ఉండి నూతన ప్రెస్‌క్లబ్ సభ్యులు ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజును ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కృష్ణమోహన్, కార్యదర్శి జోషి ఆయనకి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం నూతన ప్రెస్‌క్లబ్ కమిటీని ఆయన అభినందించారు. ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులకు ఆయన సూచించారు.