KRNL: మద్దికేర నుంచి గుంతకల్ రహదారిలో ఏర్పడిన అనేక గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోమవారం ఆ గుంతలను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేశారు. యువకుల ఈ చొరవను పలువురు వాహనదారులు, గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, వంశీ, నాగరాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.