PPM: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వి.కరుణ సోమవారం వైద్యులకు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు ప్రధానమైనవని, జిల్లాలో తప్పకుండా వైద్య ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై సమీక్షించారు.