E.G: గోకవరం వైసీపీ సీపీ సీనియర్ నాయకుడు సుంకర వెంకటరమణను మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ తోట నరసింహం గురువారం పరామర్శించారు. సుంకర వెంకటరమణ ఇటీవల గుండెకు సంబంధించిన అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.