VSP: GVMC 18వ వార్డు MVP కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబ సభ్యుల వివరాలు, QR కోడ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. కొత్త విధానం ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.