పల్నాడు: సత్తెనపల్లి పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా ఉన్న కందిపప్పు మిల్లులో గురువారం దొంగలు పడ్డారు. దొంగలు మిల్లు వెనక వైపు నుంచి వచ్చి బీరువా పగలగొట్టి రూ.35వేల నగదు ఎత్తుకొని వెళ్లారు. 20 రోజుల కిందట చెక్ పోస్ట్ సమీపంలో ఎరువుల షాపు, హోండా షోరూంలలో దొంగలు పడి 4లక్షల 10వేల రూపాయలు దొంగలు ఎత్తుకుపోయారు. అది మరువక ముందే పట్టణంలో ఇలా జరిగింది.