W.G: ఆర్ పీడబ్ల్యుడీ యాక్ట్- 2016 అమలు చేస్తే దివ్యాంగుల్లో మరి కొంతమందికి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని సక్షమ్ జిల్లా అధ్యక్షుడు కేఎస్ కేఎస్ అప్పారావు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో ఆర్పీడబ్ల్యుడి యాక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.