CTR: ఉమ్మడి చిత్తూరులో జిల్లాలో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్లు వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్ రావు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని తెలినపారు.